తెల్లచొక్కా - ఖాకీనిక్కర్ లో కనిపించే ఆరెస్సెస్ కార్యకర్తలు ఈ దశరా నుంచీ తెల్ల చొక్కా, కాకీఫ్యాంట్ లోకి మారిపోనున్నారు.
అయితే ఆరెస్సెస్ దశాబ్దాల తరబడీ కొనసాగిన యూనిఫాం ఇప్పుడు వున్నట్టుండి మార్చడంపై ఆర్జేడీ అధ్యక్షుడు లాలు ప్రసాద్ యాదవ్ తనదైన సైలిలో కామెంట్లు చేశారు.
తన భార్య బీహార్ మాజీ సీఎం రబ్రీదేవి చెప్పడం వల్లే ఆరెస్సెస్ వాళ్లు ప్యాంట్లు ధరిస్తున్నారని ఆయన తన ట్విట్టెర్లో ఎద్దేవా చేసాడు. పట్టపగలు కూడా సిగ్గు లేకుండా ఆరెస్సెస్ వాళ్లు నిక్కర్లతో తిరుగుతున్నారంటూ తన భార్య అనడంతో వాళ్లు నిక్కర్లు వదిలి, ప్యాంట్లకు మారారని అన్నాడు!
ఇంతటితో ఆగని లాలూ "ఇప్పుడే సగం ప్యాంట్లను ఫుల్ చేయించుకున్నాం. మా బుర్రలను కూడా ఫుల్ చేసుకుంటాం. నిక్కర్లే కాదు ఆలోచనలు కూడా మార్చుకుంటాం.." అంటూ ఆరెస్సెస్ ను ఉద్దేశించి లాలూ సెటైర్ లు కూడా వేసాడు.
ఈ కామెంట్లపై ఆరెస్సెస్ మాత్రం ఏమీ స్పందించలేదు.
లాలూ మార్కు కామెడీ, వ్యాఖ్యలు, సరదాగా వున్నా, ప్రత్యర్థులకు చురుక్కుమనిపించేలా కూడా వుంటాయనడంలో సందేహం లేదు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి