google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: KCR అంటే?

12, అక్టోబర్ 2016, బుధవారం

KCR అంటే?



 కేంద్రమంత్రి వెంకయ్య తరచూ ప్రదాని మోడీ గురుంచి 3g ప్రదాని అని చెబుతూ, మూడు 'g' లు అంటే ఏమిటో విడమరిచి చెబుతున్నట్టే, తెలంగాణ సీఎం కేసీఆర్‌‌ అల్లుడు ,మంత్రి హరీష్ రావు అలాంటి  పొగడ్తల పధజాలాన్ని కొత్తగా సృష్టించి, మామపై తన అభిమానాన్ని చాటుకున్నాడు.

  ఇవాళ సిద్ధిపేట జిల్లా ప్రారంభోత్సవం అనంతరం ఆయన కేసీఆర్ గురించి మాట్లాడుతూ,.కేసీఆర్ అంటే కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కాదని, K అంటే KNOWLEDGE (జ్ఞానము), C అంటే COMMITMENT(నిబద్ధత), R అంటే RECONSTRUCTION(తెలంగాణ పునర్నిర్మాణం) అని ఆయన KCR కు కొత్త అర్థాన్ని చెప్పాడు.

 ఈ మూడింటిని నిజం చేసిన కేసీఆర్‌కు శిరసు వంచి హరీష్ పాదాభివందనం చేస్తున్నానని హరీష్ అన్నారు. . సిద్ధిపేట జిల్లాగా ఏర్పడటం  ఎంతో సంతోషాన్నిచ్చిందని మంత్రి చెప్పారు.

 కేసీఆర్ సిద్దిపేట మాట్లాడుతుంటే హనుమంతుడి ముందు కుప్పిగంతులు వేసినట్లే ఉంటుందని హరీష్ చెప్పుకొచ్చాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి