మైంటైన్ చెయ్యలేక, అతి ఖరీదైన కారును తిరిగి ఇచ్చెయ్యాలని, ఒలింపిక్స్‌లో భారత్ తరపున జిమ్నాస్టిక్స్‌లో అద్భుత ప్రతిభ కనబరిచిన దీపా కర్మాకర్ నిర్ణయించుకుంది.!
సచిన్ చేతుల మీదుగా బహుకరించిన ఈ బీఎండబ్ల్యూ కారును తిరిగిచ్చేయాలని ఆమె అనుకుంటున్నట్టు తెలిసింది. అంత ఖరీదైన కారును గుంతలు,ఎత్తుపల్లాలు ఎక్కువగా వుండే, అగర్తలా రోడ్లపైన తిప్పడం కష్టమైన పనని, అంతేకాకుండా అగర్తలాలో బీఎండబ్ల్యూ సర్వీస్ సెంటర్ కూడా లేదట.
అందుకే ఆమె కారును తిరిగిచ్చేదామనుకుంటోందని ఆమె కోచ్ బిశ్వేస్వర్ నంది తెలిపారు. ఈ విషయాన్ని సచిన్ మితృడు చాముండేశ్వరినాథ్ దృష్టికి కూడా తీసుకెళ్లినట్లు నంది మీడియాకు వెల్లడించారు.
చాముండి కూడా స్పందిస్తూ, దీప కారును ఇచ్చేసినా, ఆ కారు ఖరీదు చేసే డబ్బును దీపా అకౌంట్లో వేస్తానని చెప్పినట్లు తెలిపారు.
సెప్టెంబర్‌లో పీవీ సింధుకు, దీపా కర్మాకర్‌కు, సాక్షి మాలిక్‌కు క్రికెట్ దిగ్గజం సచిన్ చేతుల మీదుగా చాముండేశ్వరినాథ్ బీఎండబ్ల్యూ కార్లను ప్రదానం చేసిన సంగతి తెలిసిందే.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి