తమ నేతలపై సీఎం కేసీఆర్ పదే పదే సన్నాసులు, దద్దమ్మలు అంటూ దూషణలు చేస్తుండడాన్ని కాంగ్రెస్ పార్టీ తీవ్రంగా పరిగణిస్తోంది. తాము అడుగుతున్న ప్రశ్నలకు సూటిగా సమాధాన చెప్పకుండా.. సీఎం ప్రతిసారీ తిట్ల పురాణం అందుకుంటున్నారని, ఇకపై తాము కూడా ఘాటుగానే స్పందించాలని, అవే పదాలను సీయం మీద ప్రయోగించాలని భావిస్తున్నారు!
సోమవారం గాంధీభవనలో జరిగిన సమావేశంలో టీపీసీసీ చీఫ్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, జానారెడ్డి, షబ్బీర్ అలీ, భట్టి విక్రమార్క, మల్లు రవి, పొంగులేటి సుధాకర్‌రెడ్డి తదితర సీనియర్ నాయకులు సీఎం ధూషణలపై చర్చించారు. ఇకపై సీఎం వ్యాఖ్యలకు ఘాటుగా అదే భాషలో సమాధానాలు ఇవ్వాలని నిర్ణయించారు.
కాబట్టి ఇకనుంచీ తెలంగాణా రాజకీయ రణరంగంలో బూతువాగ్భాణాల పరంపర ఇరువైపులా దూసుకు రాబోతున్నాయన్నమాట1!

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి