google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: శ్రియా లవ్ లో పడిందా??

13, అక్టోబర్ 2016, గురువారం

శ్రియా లవ్ లో పడిందా??



 15 సంవత్సరాల  సుధీర్గ కెరీర్‌ లో పెద్దగా లవ్ ఎఫైర్లూ, చాటుమాటు గాసిప్ లకు చోటివ్వకుండా, కొనసాగుతూ, ప్రేక్షకుల్ని అలరిస్తూనేవున్న శ్రియా, ఇప్పుడు మీడియాకు ఫుల్ మీల్స్ పెట్టినట్టే కనిపిస్తొంది!

సినీ పరిశ్రమ కాకుండా, క్రీడారంగంలోని వ్యక్తితో ప్రేమలో పడిందనే వార్త షికారు చేస్తొంది.

వెస్టిండీస్‌ ఆల్‌రౌండర్‌, డ్యాన్సింగ్‌ క్రికెటర్‌ డ్వేన్‌ బ్రావోతో శ్రియ లవ్‌ట్రాక్‌ నడుస్తోందని తెలుస్తోంది.
 ఐపీఎల్‌తో ఆడుతూ, అడపాదడపా బాలీవుడ్‌ సినిమాల్లో నటించే బ్రేవొ ఇండియన్ క్రికెట్ అభిమానులకు సుపరిచితుడే.
 ఐ.పి.ఎల్. సంధర్భంగా ఇద్దరికీ పరిచయం కుదిరి, తర్వాత ముదిరిందని అనుకుంటున్నారు.

 తాజాగా శ్రియ, బ్రావో డేటింగ్‌లో ఉన్నారని బాలీవుడ్ మీడియా అంటోంది. ముంబై శివార్లలోని ఓ రెస్టారెంట్‌ నుంచి  నుంచి బయటకు వస్తూ మీడియా కంటికి చిక్కారు. తరచూ ఈ రెస్టారెంట్లోనే ఇద్దరూ కలుస్తుంటారని అంటున్నారు.

 వారిద్దరూ ప్రేమలో ఉన్నారా? లేక, ఏదైనా అడ్వెర్టైస్ మెంట్ లో నటించడాని కలిసారా..? తెలియాలంటే కొన్ని రోజులు ఓపికపట్టాల్సిందే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి