google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పవర్ స్టార్ ప్రక్కన నయనతార!

14, అక్టోబర్ 2016, శుక్రవారం

పవర్ స్టార్ ప్రక్కన నయనతార!





తమిళంలో చిత్రం ‘వేదాళం’ని  తెలుగులో పవన్‌ కల్యాణ్‌తో రీమేక్‌ చేస్తున్నారు. ఆర్‌.టి.నేసన్‌  ఈ మూవీకి దర్శకత్వం వహిస్తునాడు.

 ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ చిత్రంలో కథానాయికగా నయనతారని ఎంచుకొన్నట్టు తెలుస్తోంది.  పవన్‌తో నయన నటించడం ఇదే తొలిసారి. శ్రీ రామరాజ్యం తర్వాత గ్యాప్ తీసుకుని, వెంకీ తో నటించిన 'బాబు బంగారం' నయనతారకు చివరి సినిమా.

  అడపాదడపా అవకాశాలు ఇస్తున్నా, ఎందుకో అంతకుముందులా నయనతార తెలుగులో నటించడంలేదు.  పవన్‌ సినిమాలో నయన నటిస్తుందో లేదో,  చిత్రబృందం, నయనతార  అధికారికంగా ప్రకటించాల్సి ఉంది.  ఈ చిత్రంలో నయనతారతో పాటు  మరో కథానాయిక కూడా  నటిస్తున్నట్టు సమాచారం.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి