బాహుబలి మొదటిభాగం ప్రపంచ వ్యాప్తంగా భారీ విజయాన్ని సాధించడంతో, ఆ సినిమాకు సీక్వెల్ గా వస్తున్న రెండవభాగం ‘బాహుబలి 2’ విడుదలకు ముందే సంచలనాల్ని సృస్జ్టిస్తోంది.
తాజాగా బహుబలి 2 నైజాం(తెలంగానా ) హక్కులను రూ.50 కోట్లకు ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ అధినేతలు సొంతం చేసుకున్నారు.ఇంత భారీ మొత్తాన్ని చెల్లించి, హక్కులను సొంతం చేసుకోవడంతో సినీ వర్గాల్లో ఈ విషయం హాట్ టాపిక్ గా మారింది. ఏషియన్ ఎంటర్‌ప్రైజెస్ అధినేతలు నారాయణ్‌దాస్ నారంగ్, సునీల్ నారంగ్‌లు మూవీని దక్కించుకున్నారు.
ఈ సందర్భంగా వీరు మాట్లాడుతూ.. ఇంతవరకు మా సంస్థ ద్వారా ఎన్నో విజయవంతమైన చిత్రాలను తెలంగాణలో పంపిణీ చేశాం. తాజాగా ‘బాహుబలి’ చిత్రానికి ఉన్న క్రేజ్ దృష్ట్యా పోటీ మధ్య ‘బాహుబలి 2’ హక్కులను పెద్ద మొత్తానికి సొంతం చేసుకున్నాం. సినిమా ఘన విజయం సాధించి, మా సంస్థకు మంచి పేరు తెచ్చిపెడుతుందని ఆశిస్తున్నాం’ అని తెలిపారు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి