google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఉగ్రవాదుల ప్రక్కన కేజ్రీవాల్‌ ఫొటో !!

14, అక్టోబర్ 2016, శుక్రవారం

ఉగ్రవాదుల ప్రక్కన కేజ్రీవాల్‌ ఫొటో !!




సూరత్‌లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా వివాదాస్పద పోస్టర్లు వెలిశాయి.

గుజరాత్‌లో పోస్టర్ల వివాదం కొనసాగుతోంది. రానున్న గుజరాత్‌ అసెంబ్లీ ఎన్నికలను సంధర్భంగా ,దిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌ ఆదివారం సూరత్‌లో జరగబోయే ర్యాలీలో పాల్గొననున్నారు. కేజ్రీవాల్ ని వ్యతిరేకిస్తూ,   పాకిస్థాన్‌ అనుకూల ఉగ్రవాదులు బుర్హాన్‌ వనీ, హఫీజ్‌ సయీద్‌, బిన్‌లాడెన్‌ ఫొటోల మధ్య కేజ్రీవాల్‌ ఫొటోనుపెట్టి బ్యానర్‌లను గుర్తుతెలియని కొంతమంది  ఏర్పాటు చేశారు.

 సూరత్‌లోని పలు ప్రాంతాల్లో కేజ్రీవాల్‌కు వ్యతిరేకంగా ఇలాంటి  బ్యానర్లు, పోస్టర్లు అంటించారు. ఐతే వీటిని  గమనించిన ఆప్‌ కార్యకర్తలు వాటన్నింటినీ వెంటనే తొలగించారు.

ఈ దుశ్చర్యకు  భాజపానే భాధ్యత వహించాలంటూ ఆమ్‌ ఆద్మీ పార్టీ తీవ్ర విమర్శలు చేస్తోంది.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి