వైకాపా నేత రోజా తనదైన శైలిలో మరోసారి రెచ్చిపోయింది.
టీడీపీ యువనేత నారా లోకేష్ సిమ్‌కార్డులేని సెల్‌ఫోన్ అని వైసీపీ ఎమ్మెల్యే రోజా ఘాటుగా విమర్శ చేసింది.
లోకేష్‌కు, జగన్‌కు పోలికే లేదని, ఆమె అంది. లోకేష్‌కు బిల్డప్ ఎక్కువ.. బిజినెస్ తక్కువ అని రోజా వ్యంగ్యంగా కామెంట్ చేసింది.
రూ.10వేలకోట్ల నల్లధనం వివాదం గురించి మాట్లాడుతూ, రోజా గుమ్మడికాయల దొంగ జగన్ కాదు, చంద్రబాబే అని విమర్శించింది. నల్లధనానికి చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని, చంద్రబాబు, వెంకయ్య అవిభక్త కవలలనీ, వీరిమధ్య ఒప్పందాలు బయటపెట్టాలని ఆమె డిమాండ్ చేసింది.
అంతేకాకుండా చంద్రబాబు మానసికస్థితి సరిగా లేదని . ఏపీలో చంద్రబాబు పుట్టినందుకు మనం సిగ్గుపడాలనీ రోజా వ్యాఖ్యానించింది. నల్లధనంపై విచారణకు చంద్రబాబు సిద్ధమా? అని రోజా సవాల్ కూడా విసిరింది.
డేర్ గా చేసిన రోజా కామెంట్లు, టిడిపి వర్గాల్లో ఎలాంటి కాక రేపుతుందో చూడాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి