లోకేష్ ని ' సింకార్డ్ లేని మొబైల్ ' గా ఎద్దేవా చేసిన, వైకాపా ఎమ్మెల్యే రోజాకు మంత్రి పరిటాల దగ్గరనుంచి కౌంటర్ ఎదురైంది.
డ్వాక్రా రుణమాఫీ చేసి మహిళలకు అండగా నిలబడ్డ సీయం చంద్రబాబును, మహిళాద్రోహి అనడానికి ఎమ్మెల్యే రోజాకు నోరు ఏవిధంగా వచ్చిందని మంత్రి పరిటాల సునీత మండిపడ్డారు. రోజా...నీ నోరు అదుపులో పెట్టుకో అని ఆమె హెచ్చరించారు.
టీడీపి ప్రభుత్వం మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు, మహిళలకు ఆస్తిహక్కు, మహిళా విశ్వవిద్యాలయాలను ఏర్పాటు చేసిందని సునీత గుర్తుచేసింది. లోటు బడ్జెట్ వున్నాగానీ డ్వాక్రా మహిళలకు రుణమాఫీ చేసి అండగా నిలబడ్డ చంద్రన్నను విమర్శించే అర్హత రోజాకు లేదని ఆమె ఒక ప్రకటనలో విమర్శించారు.
ఇదిలా వుండగా మరో మంత్రి అనిత మరో ప్రకటనలో రోజాకు ఇంకా సినిమా మత్తు వద్దలేదని, అందులోంచి బయటకు వచ్చి, జాగ్రత్తగా మాట్లాడాలని హెచ్చరించారు.
మహిళా మంత్రుల మాటలకు రోజా ఏవిధంగా కౌంటర్ ఇస్తుందో మరి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి