google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: 'జగన్ బ్యాటరీ లేని సెల్ ఫోన్'

15, అక్టోబర్ 2016, శనివారం

'జగన్ బ్యాటరీ లేని సెల్ ఫోన్'



 శుక్రవారం  ప్రెస్ మీట్ పెట్టిన  వైసీపీ ఎమ్మెల్యే రోజా సీఎం చంద్రబాబును, లోకేష్ ను తనదైన శైలిలో, కడిగిపారేయడంతో, ఇప్పుడు రోజాకు కౌంటర్ ఇచ్చేపనిని టీడీపీ నేతలుమొదలుపెట్టారు.

 రోజా, బాబు తనయుడు లోకేష్ ను సింకార్డు లేని మొబైల్ గా వ్యాఖ్యానించడంపై, స్పందించిన టీడీపీ ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న తీవ్రస్థాయిలో ఘాటైన విమర్శలు చేశాడు. జగన్ ఓ బ్యాటరీలేని సెల్ ఫోన్‌ అని ఎద్దేవా చేసిన వెంకన్న, రోజాను వైసీపీ పెయిడ్ వర్కర్ అని అభివర్నించాడు. చంద్రబాబును ఎదుర్కోవడానికి, వైసీపీ రోజాను శిఖండిలా వాడుకుంటోందని  విమర్శించాడు.

ఇదే సందర్భంలో వెంకన్న మాట్లాడుతూ, ఏపీ ప్రజలు జగన్ ను ప్రతిపక్ష నాయకుడిగా చేస్తే.. జగన్ మాత్రం హైదరాబాద్, బెంగుళూరుల్లోను కాలం గడుపుతున్నారని అన్నాడు. ఆంధ్రా ప్రజల పరిస్థితుల కంటే జగన్ కు తన కేసులు, బిజినెస్ విషయాలే ఎక్కువని అన్నాడు.

ఇదంతా బాగుంది కానీ, ఎంకిచావు సుబ్బికొచ్చినట్టు, ఇరు పార్టీల నాయకులు ఒకర్నొకరు తిట్టుకోకుండా, తమ తమ నేతల్ని తిట్లపురాణంలోకి లాగుతూండడంతో నేతలు తలలు పట్టుకుంటున్నారు.

గుడ్దిలో మెల్లలా, ఈ నాయకులు మరీ బూతులజోలికి వెళ్ళకుండా, మొబైల్, సిం, బ్యాటరీ లాంటి వాటితో పోల్చుకోవడం ఒకింత ఉపశమనం కలిగించే విషయమే.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి