భీమవరంలో అక్వా ఫుడ్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ ఉద్యమిస్తోన్న ప్రజలకు మద్దతుగా జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టాడు.
అధికారంలో వున్న నాయకులుగానీ, ప్రతిపక్ష నేతలు గానీ తమకు న్యాయం చెయ్యరన్న నమ్మకంతో, గోదావరి జిల్లాల రైతులంతా పవన్ కళ్యాణ్ ను కలిసి తమ గోడు వెల్లబోసుకోవడంతో, వారి సంఘీభావంగా ప్రెస్ మీట్ ఏర్పాటు చేశాడు.
ప్రెస్ మీట్లో రైతులు మాట్లాడుతూ, తమ ఆవేదనను వెల్లడించారు.
రెండున్నరేళ్లుగా మా గోడు పట్టించుకోవడంలేదు., ఆక్వా ఫ్యాక్టీరికి వ్యతిరేకంగా గొంతెత్తున్న వారిపై బైండోవర్ కేసులు పెట్టి మరీ వేధించుకు తింటున్నారు. ఫ్యాక్టరీ రసాయనాల వల్ల గుంతేరు కాలువ కలుషితమైపోతే పంట పొలాలు నాశనమైపోతే. మా పరిస్థితేంటి?.అంటూ ఆవేదనగా మాట్లాడారు.
పవన్ మిగతా సమస్యలకు లాగే ముందస్తు మద్దతు ప్రకటించి, తర్వాత చల్లబడిపోతాడా? లేక, ఈ సమస్యను పరిష్కరించడానికి, ఏదైనా చర్యలు తీసుకునేలా ప్రభుత్వంతో చర్చలు జరుపుతాడా అన్నది వేచి చూడాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి