google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: వారణాసి లో ఘోరం

15, అక్టోబర్ 2016, శనివారం

వారణాసి లో ఘోరం



 ప్రధాని నరేంద్రమోదీ నియోజకవర్గం వారణాసిలో విషాదం చోటు చేసుకుంది.

 నగరంలోని రాజ్‌ఘాట్ వంతెనపై జరిగిన తొక్కిసలాలో 19మంది చనిపోయారు. మరో 22మంది గాయపడ్డారు. ప్రమాదపు తీవ్రతను బట్టి మరణాల సంఖ్య మరికాస్త పెరిగే అవకాశం వుంది.

జైగురుదేవ్ బాబా‌కు సంబంధించిన కార్యక్రమం జరుగుతుండగా, తొక్కిసలాట జరిగింది, ఊహించిన దానికంటే ఎక్కువగా భక్తులు గుమికూడటంతో ఈ విషాదం చోటుచేసుకుంది. ముందస్తుగా  ఎలాంటి జాగ్రత్తలు పాటించక పోవడంతో తొక్కిసలాట జరిగినట్టు తెలుస్తోంది.

 సమాచారం అందిన వెంటనే పోలీసులు, వైద్య సిబ్బంది అక్కడకు చేరుకుని, గాయపడిన వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి