అమెరికా అధ్యక్ష ఎన్నికల పోటీదారులమధ్య, లైంగిక వ్యాఖ్యల ఆరోపణల పర్వం మరో మలుపు తిరిగింది.
ఒకప్పుడు తాను కూడా ట్రంప్ లైంగిక బాధితురాలేనని అంటూ డెమోక్రటిక్ అభ్యర్థి హిల్లరీ క్లింటన్ ట్రంప్ పై సంచలన ఆరోపణలు చేసింది.!
ఆదివారం ఓ టీవి చానెల్ డిబేట్ లో పాల్గొన్న హిల్లరీ, తన ప్రత్యర్దిపై ఈ వ్యాఖ్యలు చేశారు.
కొన్నిసార్లు 'ప్రేమోన్మాదిగా మారిపోయిన ట్రంప్ తన వెంట కూడా పడ్డాడనీ, మీదిమీదికొచ్చి ఇబ్బంది పెట్టేలా ప్రవర్తించాడనీ' చెప్పింది.
అయితే హిల్లరీ ఆరోపణలను ట్రంప్ కొట్టిపారేశాడు. హిల్లరీ ఆరోపణల్లో నిజం లేదని, కేవలం తన ప్రతిష్ఠను మసకబార్చేందుకే హిల్లరీ అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారని ఆరోపించాడు.
అగ్రరాజ్యం అధ్యక్ష పదవికి పోటీపడుతున్న అభ్యర్ధుల మధ్య, ఇలా చీప్ వ్యవహారాలమీద వాదాలు, వివాదాలు కొనసాగుతుండటంతో, ప్రపంచదేశాల దృష్టిలో అమెరికా పరువు నానాటికి దిగజారుతోంది.
ఇద్దరు అభ్యర్థుల వయసు ఇంచుమించు 70 కావడం విశేషం.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి