రామ్ చరణ్ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ ఉండటంతో, రామ్ చరణ్ అకస్మాత్తుగా తన యూఎస్ టూర్ రద్దు చేసుకున్నారు. అమెరికాలోని న్యూజెర్సీ లో అక్టోబర్ 15న జరిగే చారిటీ కార్యక్రమానికి హాజరై లైవ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వాల్సి ఉంది.
ఈ విషయాన్ని చరణ్ ఫేస్ బూక్ ద్వారా తెలియజేస్తూ..'హ్యూమానిటీ యూనైటెడ్ అగైనిస్ట్ టెర్రర్' చారిటీ ఈవెంటుకు హాజరు కాలేక పోతున్నాను. అక్కడ పెర్పార్మెన్స్ ఇవ్వడానికి ఎంతో ఆతృతగా ఎదురు చూసాను. కానీ ఫ్యామిలీలో మెడికల్ ఎమర్జెన్సీ ఉండడం వలన హాజరు కాలేకపోతున్నాను. నిర్వహకులకు ఆల్ ది బెస్ట్ అంటూ పోస్టు చేసాడు.
అయితే రామ్ చరణ్ పోస్టుతో అభిమానుల్లో కంగారు మొదలైంది! మెగా ఫ్యామిలీలో ఎవరికి ఏమైందోనని, మెడికల్ ఎమర్జెన్సీ ఎందుకని అందోళణ పడ్తున్నారు.
కానీ మెగాఫామిలీకి బాగా దగ్గరైనవారి సమాచారం మేరకు, ప్రతి సంవత్సరం ఇలాంటి మెడికల్ ఎమర్జెన్సీ వుంటుందనీ, కుటుంబంలోని ప్రతి ఒక్కరూ విధిగా వైధ్యపరీక్షలు చేయించుకుంటారని, నిజానికి ఇలాంటి ఎమర్జెన్సీ అనేది ప్రముఖుల కుటుంబాలలో సహజంగా జరిగేదేనని అంటున్నారు.
కాశ్మీరీ పండిట్లపై జరిగిన ఉగ్రవాద దాడుల్లో నష్టపోయినవారిని ఆదుకోవడానికి అమెరికాలోని న్యూజెర్సీలో ఈనెల 15న జరుగబోయే ఈవెంట్ లో సినీతారలు పాల్గొని పర్ఫార్మెన్స్ లు చేయనున్నారు. ఈ ఈవెంట్ లో అఖిల్, శ్రీయ, ప్రభుదేవా, మలైకా అరోరా, సోఫీ చౌదరిలు పాల్గొననున్నారు.
ఆసక్తికర విషయం ఏమిటంటే, ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డోనాల్డ్ ట్రంప్ హాజరవుతున్నాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి