google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఐష్.. సెన్సార్ సిగ్గుపడేలా!!

15, అక్టోబర్ 2016, శనివారం

ఐష్.. సెన్సార్ సిగ్గుపడేలా!!






  'యే దిల్ హై ముష్కిల్'  టీజర్ తోనే సినీ ప్రేక్షకుల గుండెలు వేడెక్కించడమే కాకుండా,  సినిమా మీద అంచనాలు భారీగా పెరిగిపోవడానికి కారణం, ఈ మూవీ లో ఐశ్వర్యారాయ్ రణబీర్ కపూర్ తో రెచ్చిపోయి నటించిన సన్నివేశాలే  అని చెబుతున్నారు.

పైగా ఇందులోని వీరిద్దరి సన్నివేశాలు చూసి, సెన్సార్ బోర్డ్ సభ్యులే ముక్కుమీద వేలేసుకున్నట్టు చెబుతున్నారు.! కొన్ని సన్నివేశాలను ఒప్పుకోవడానికి ససేమీర అన్నట్టు కూడా తెలుస్తోంది.

 ఈ నెల 28న రిలీజ్ అవుతున్న దీనికి కరణ్ జోహర్ డైరెక్టర్.

ఐష్ ఇలా హాట్ హాట్ సీన్ల లో నటించడాన్ని సినీవర్గాలు బిన్నవాదనలు వినిపిస్తున్నారు, ఇలా నటించడంవల్ల ఐశర్యారాయ్ కి అవకాశాలు పెరిగే అవకాశం లేదని, పైగా బచ్చన్ ఫామిలీకి వున్న ఇమేజ్ దెబ్బతినే అవకాశం వుందనీ అంటున్నారు. కానీ కొందరు మాత్రం ఐష్ కు సినిమా పట్ల వున్న డెడికేషన్ కి ఇది ఉదాహరణ అని చెబుతున్నారు.

ఐతే, వయసు మీదపడినా తనలో బింకం తగ్గలేదని, ప్రేక్షకుల్ని రంజింపజేసే అందం తనలో అలాగే వుందని చెప్పడానికే ఐష్ ఇలా చేస్తోందనే వివరణలు కూడా వినిపిస్తున్నాయి.

 తమ చిత్రానికి సెన్సార్ సభ్యులు ఎలాంటి కట్స్ చెప్పలేదని కరణ్ వర్గం చెబుతోంది. ఏదీఎమైనా అభిమానులు మాత్రం 28 తేది కోసం ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి