చాలా గ్యాప్ తర్వాత క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ, సందీప్ కిషన్, సాయిధరమ్ తేజ్, రెజీనాలతో తెరకెక్కిస్తున్న నక్షత్రం మూవీ టీజర్, ఫస్ట్ లుక్ ను హీరో రాంచరణ్ విడుదల చేసాడు.
గత కొద్ది కాలంగా కృష్ణవంశీ కి సరైన సక్సెస్ రావడంలేదు.. చెర్రీతో 'గోవిందుడు అందరివాడేలే' కూడా నిరాశ పరిచింది.
ఇంత కాలం ఎలాంటి చడీ చప్పుడు లేకుండా షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ సైలెన్స్‌ను బ్రేక్ చేస్తూ ‘నక్షత్రం’ కి సంబంధించిన ఫస్ట్‌లుక్ విడుదలైంది. రామ్‌చరణ్ స్పెషల్‌గా తన ఫేస్ బుక్ లో టీజర్‌ను, ఫస్ట్‌లుక్‌ను విడుదలచేసి, అభిమానులను అలరించాడు.
తన ఫేవరెట్ డైరెక్టర్ కృష్ణవంశీ తీస్తున్న ఈ సినిమా, ఫస్ట్‌లుక్ అదిరిందని, రాంచరణ్ ప్రశంసలు కురిపించాడు. కృష్నవంశీ మళ్ళీ ఓ మ్యాజిక్ సృష్టించబోతున్నాడని, లోగో చాలా బాగుందని అన్నాడు. నక్షత్రం టీమ్‌కు అభినందనలు అంటూ స్వదస్తూరితో శుభాకాంక్షలు తెలిపాడు.
సినిమా అభిమానులు కూడా కృష్ణవంశీనుంచి అలాంటి మ్యాజిక్ కోసం చాలారోజుల నుంచీ ఎదురుచూస్తున్నారు. మరి ఈ మూవీ ఎలా వుండబోతోందో వేచి చూడాలి.
పోలీస్ కావాలనుకున్న ఓ యువకుడికి ఎదురైన అనుభవాలేంటి అన్న కాన్సెప్ట్‌తో కృష్ణవంశీ ఈ సినిమాను తీస్తున్నట్టు తెలిసింది.


కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి