google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఎవరూ చెప్పరేం?

9, అక్టోబర్ 2016, ఆదివారం

ఎవరూ చెప్పరేం?





దాదాపు 18 రోజులుగా తమిళనాడు రాష్ట్ర ముఖ్యమంత్రి జయలలిత ఆసుపత్రిలో ఉన్నారు.  ఆమెకు ఉన్న అసలు సమస్య ఏమిటన్నది ఇప్పటివరకూ అధికారికంగా బయటపెట్టడం లేదు!

ఎప్పటికప్పుడు అమ్మ ఆరోగ్యం కుదుట పడిందనో, ఆమెకు మెరుగైన చికిత్సను అందిస్తున్నామనో, అమ్మ శరీరం చికిత్సకు సహకరిస్తుందని ఆమె కోలుకుంటున్నారు వెంటిలేటర్ పై వున్నారు.., లాంటివి మాత్రమే హెల్త్ బులిటెన్లో వస్తున్నాయి.

 అపోలో ఆసుపత్రి వర్గాలు   జయలలితకు  జరుగుతున్న చికిత్సకు సంబంధించిన ఒక అంశాన్ని నిన్న చెప్పడంతో ఆమెకు ఏమైందో తెలుసుకోవడానికి ఒక అవకాశం దొరికింది.

 విపరీతమైన జ్వరం.. డీ హైడ్రేషన్ అని, దానికి సంబందించి అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో చికిత్స జరుగుతోందనీ  ప్రకటించారు. అందుకు మించి ఆమెకున్న సమస్యల గురించి బయటపెట్టలేదు.

కేవలం జ్వరం , డీహైడ్రేషన్ మాత్రమేవుంటే, ఇంత గోప్యత ఎందుకు పాటిస్తున్నారో తెలియక ప్రజలు, ఆమె అభిమానులు ఆందోళణ పడ్తూన్నారు.

జయలలితకు మల్టీఫుల్ ప్రాబ్లమ్స్ ఉన్నట్లుగా తెలుస్తున్నా, అధికారికంగా అలాంటి సమాచారం బయటకు రాలేదు.చికిత్సకోసం  లండన్ నుంచి,ఎయింస్ నుంచీ వైద్యులు వస్తూ వుండటం, పైగా శశికళ లాంటి వారిని తప్ప, ఎవర్నీ ఆమె దగ్గరకు అనుమతించకుండా వుండటంతో అనేక అనుమానాలకు తావిస్తోంది.

జయకు  ఊపిరితిత్తులకు సంబంధించిన  శస్త్ర చికిత్స కూడా జరిగినట్టు తెలుస్తోంది. దానికి సంబందించి, ఫిజియోతెరఫీ కూడా ఇస్తున్నట్టు అపోలో వర్గాలు తెలిపాయి. ఇలా అనేకరకాల రుగ్మతల్నీ, చికిత్సల గురించీ తెలుసుకోవడం కంటే, తమిళప్రజలు తమ ఆరాధ్య నాయకురాలు ఒక్కసారి స్పృహలోవుండి పలకరిస్తే మనశ్శాంతి పొందుతారేమో.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి