తమిళనాడు ముఖ్యమంత్రి జయలలిత ఆరోగ్య పరిస్థితులపై సామాజికమాధ్యమాల్లో వదంతులు వ్యాపింపజేసినందుకు ఇద్దరు కటకటాల పాలైనారు.
జయ ఆరోగ్యపరిస్థితి బాగా క్షీణించిందని, ఆమె మృత్యువుకు చేరువయ్యారంటూ ఫేస్ బూక్ లో సమాచారాన్ని పెట్టిన నామక్కల్‌కు చెందిన సతీశ్ కుమార్‌ను సోమవారం పోలీసులు అరెస్టు చేశారు.
అదే విధంగా జయలలిత ఆరోగ్యపరిస్థితి గురించి, అపోలో ఆసుపత్రి నర్సు ఫోన్‌లో మాట్లాడినట్లుగా ఓ ఆడియోను సామజిక మాధ్యమంలో పంచుకున్నాడనే ఆరోపణపై మదురైకి చెందిన మాడస్వామి అనే వ్యక్తి కూదా అరెస్టు అయ్యాడు.
ఇదిలా ఉండగా జయ ఆరోగ్యంపై పుకార్లు వ్యాపింప చేశారనే ఆరోపణలపై పోలీసులు ఇప్పటికే 40 మందికి పైగా వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి