google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: సరిహద్దులు దాటేస్తాం!

10, అక్టోబర్ 2016, సోమవారం

సరిహద్దులు దాటేస్తాం!


కశ్మీర్‌లోని పరిస్థితిని ప్రపంచానికి తెలిపేందుకు నవంబర్ 24న భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు, ఇందుకోసం సరిహద్దుల్ని దాటి, భారత్ లోకి ప్రవేశిస్తామని పాక్ ఆక్రమిత కశ్మీర్ మాజీ ప్రధాని సర్దార్ అట్టిక్యూ అహ్మద్ ఖాన్ చెపాడు.

 కాల్పులవిరమణ నిబంధలను లెక్కచేయకుండా, పూంచ్, మిర్పూర్ సరిహద్దుల ద్వారా భారత కశ్మీర్‌లోకి ప్రవేశిస్తామని సోమవారం ఆయన తెలిపారు.

దీని కోసం కశ్మీర్‌లోని రాజకీయ పార్టీల మద్దతు కోరతానన్నారు.   ఇందులో పాల్గొని సరిహద్దు దాటేందుకు సిద్ధంగా ఉండాలని కాశ్మీర్ లోని ముస్లిం యువతకు పీవోకే మాజీ ప్రధాని  పిలుపునిచ్చాడు.

పి.ఓ.కే. లో గత కొంత కాలంగా పాక్ కి వ్యతిరేఖంగా నిరసన ప్రదర్శనలు జరుగుతున్న విషయం తెలిసిందే. దీని నుంచి ప్రపంచం దౄష్టిని మళ్ళించడానికి, పాక్ ప్రభుత్వం సర్దార్ ని ఈ పనికి పురమాయించినట్టు తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి