ఉగ్రవాదుల గురించి ప్రస్తావించాలంటే, రాజకీయనాయకులుగానీ, సినీరంగ ప్రముఖులు గానీ, కాస్త ముందూ వెనుకగా ఆలోచిస్తూన్న తరుణంలో సీనియర్ నటి శ్రియ ధైర్యంగా తన దేశభక్తిని చాటుకుంది.
కశ్మీర్ ఉగ్రదాడుల్లో ప్రాణాలు కోల్పోయిన వారి కుటుంబాలను ఆదుకొనేందుకు అక్టోబర్ 15న అమెరికాలోని న్యూజెర్సీలో ‘స్వచ్ఛంద కచేరి’ నిర్వహించనున్నట్లు సినీనటి శ్రియ వెల్లడించింది.
అలాగే ఆమె మాట్లాడుతూ, భారతదేశంలో ఉగ్రదాడుల్ని ప్రతీ భారతీయుడు తీవ్రంగా ఖండించాలని చెప్పింది.
ఇందుకోసం రిపబ్లికన్ హిందూ కొలిజియం ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమంలో తనతోపాటు రామ్‌చరణ్, ప్రభుదేవా, అఖిల్, సహా పలువురు టాలీవుడ్, బాలీవుడ్ తారలు పాల్గొని ప్రదర్శనలు ఇస్తారని తెలియజేసారు.
ఇలాంటి కార్యక్రమంలో పాల్గొనడం తనకెంతో ఉత్తేజాన్ని, దేశంకోసం ఒక మంచిపని చేస్తున్నానన్న తృప్తి వస్తుందని శ్రియ తెలిపింది.
ఇదే సంధర్భంలో శ్రియ మాట్లాడుతూ, ముంబయిలో తనచే నిర్వహిస్తోన్న స్వచ్ఛంద సంస్థ ‘స్పందన’ను త్వరలోనే హైదరాబాద్‌లోనూ ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి