google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: పిల్లలపై ప్రమాణం చేయ్‌!

11, అక్టోబర్ 2016, మంగళవారం

పిల్లలపై ప్రమాణం చేయ్‌!



 పాకిస్థాన్‌ క్రికెట్ర్ల మధ్య ఆరోపణలు ప్రత్యారోపణలు తీవ్రస్థాయిలోకి చేరుకున్నాయి.  పాక్ ఆల్ రౌండర్ షాహిద్‌ అఫ్రిది, వెటరన్‌ బ్యాట్స్‌మన్‌ జావెద్‌ మియాందాద్‌ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ గురించి, మాటల యుద్ధం సాగుతోంది.

  తన వీడ్కోలు మ్యాచ్‌ కోసం పాకిస్థాన్‌ క్రికెట్‌ బోర్డుతో అఫ్రిది రహస్యంగా సంప్రదింపులు జరిపాడంటూ ఇటీవల ప్రసార మాధ్యమాల్లో వార్తలు వచ్చాయి. దీనిపై మియాందాద్‌ స్పందిస్తూ, డబ్బుల కోసమే అఫ్రిది ఈ వీడ్కోలు మ్యాచ్‌ వ్యవహారాన్ని వార్తల్లోకి తీసుకొస్తున్నాడని పేర్కొన్నాడు.

ఈ వ్యాఖ్యలుకి కోపం తెచ్చుకున్న అఫ్రిది ‘‘డబ్బులకు ఎక్కువ ప్రాధాన్యమిచ్చేది మియాందాదే. మాజీ కేప్టన్ ఇమ్రాన్‌ ఖాన్‌కు అతడికి మధ్య అదే తేడా’’ అని ఘాటుగానే వ్యాఖ్యానించాడు. దీంతో స్వతహాగానే జగడాలమారి మియాందాద్‌ అగ్గిమీద గుగ్గిలమయిపోయి, అఫ్రిదిపై మ్యాచ్‌ ఫిక్సింగ్‌ ఆరోపణలు చేశాడు. గెలవాల్సిన ఎన్నో మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను ఓడించాడని.. ఇందుకు తన దగ్గర సాక్ష్యాలున్నాయని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తాడు.

చాలా మ్యాచ్‌ల్లో పాకిస్థాన్‌ను  అఫ్రిది ఉద్దేశపూర్వకంగా ఓడించాడు. నా ఆరోపణలు అబద్ధమైతే, తన పిల్లలపై ప్రమాణం చేసి  చెప్పమనండి, అతడి చేష్టలకు నేనే సాక్షిని. ఎన్నోసార్లు నాకు దొరికిపోయాడు’’ అని మియాందాద్‌ అన్నాడు.

దీంతో  అఫ్రిది, మియాందాద్‌ వ్యాఖ్యలపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నాడు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి