కేంద్రప్రభుత్వం దేశవ్యాప్తంగా వెల్లడించిన 65000 కోట్ల నల్లధనంలో వైకాపా అధినేత జగన్‌దే ఎక్కువ భాగమని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరావు ఆరోపించారు.
స్వచ్చందంగా నల్లధనం ప్రకటించిన వారిపేర్లు బయటపెట్టమని, వీరి మీద కేసులు బనాయించడం జరగదనీ, కేంద్రప్రభుత్వం ప్రకటించిన తర్వాత, నల్ల కుభేరుల దగ్గరనుంచి దాదాపు 65వేల కోట్ల బ్లాక్ మనీ వెల్లడైన విషయం తెలిసిందే.
ఇలా ప్రకటించిన మొత్తం నల్లధనంలో రూ.10వేల కోట్లు హైదరాబాద్ కు చెందిన వ్యక్తివని, కేంద్రం తెలియజేసింది. ఆ వ్యక్తి జగనేనని, ఉమా ఆరోపించారు.
విజయవాడలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చట్టాన్ని అడ్డం పెట్టుకుని జగన్ నల్లధనాన్ని తెల్లధనంగా మార్చుకున్నాడని, విమర్శించారు. జగన్ అవినీతి సంపదతో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టవచ్చని పేర్కొన్నారు.
ఇంతేకాకుండా, జగన్‌కు బినామీల పేరుతో తెలుగు రాష్ట్రాల్లో వేలాది ఎకరాల గనులు, భూములు ఉన్నాయని మంత్రి తెలిపారు. జగన్‌కు ఉన్న భూముల వివరాలను జిల్లా వారీగా ఆయన ప్రకటించారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి