భారత్ లో సినిమాహీరో అంటే అభిమానులకు దేవుడితో సమానం, అదే హీరోకి అభిమానులంటే ఎంత చులకనో తెలిసేలాంటి సంఘటన ముంబై లో జరిగింది.
తాజాగా ఓ హీరో తన అభిమానుల చేత ఫాంట్లు వూడదీయించి మరీ తన రాక్షసానందాన్ని ప్రదర్శించడంతో, అవాక్కవడం అభిమానుల వంతైంది.
ముంబై శివార్లలోని ఓ దుకాణం ప్రారంభోత్సవానికి వెళ్లిన బాజీరావ్ మస్తానీ హీరో రణ్‌వీర్ సింగ్ ను చూడ్డానికి భారీగా ప్రజలు తరలి వచ్చారు. హీరోతో అక్కడున్న కొందరు అభిమానులు తమ ఆనందాన్ని అణుచుకోలేక, మీకోసం ఏమైనా చేస్తామని అనడంతో, సదరు హీరోలోని మరోకోణం బయటకొచ్చింది.
'నాకోసం ఏదైనా చేస్తామంటున్నారు కదా? అయితే ప్యాంట్లు విప్పేయండి'!! అని అభిమానులను అడిగేశాడు! ఆ మాటతో మొదట ఆశ్చర్య పోయిన అభిమానులు తర్వాత, అడిగింది అభిమాన హీరోనేకదా అనుకుని,రణవీర్ చెప్పినట్టు ప్యాంట్లు విప్పేశారు!
కానీ ఆ హీరో అంతటితో ఆగలేదు, ఆ ప్యాంట్లు విప్పిన యువకులను జర్నలిస్టుల ముందు నిలబెట్టి మరీ ఫోటో తీయించాడు. సరే తాము ప్యాంట్లు విప్పాం కదా? మాకోసం మీరు కనీసం తమ కోసం షర్ట్ అయినా విప్పండని రణవీర్ ని అని వారుఅడిగితే విప్పకుండా, పొద్దున్నే టిఫిన్ ఎక్కువగా తిన్నానని, బాడీ షేప్స్ సరిగా లేవని చెప్పి తప్పించుకుని వెళ్లిపోయి అభిమానులకు ఝలక్ ఇచ్చాడు.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడైనా, హీరొలు తెరమీదేగానీ, నిజ జీవితంలో కాదని, సినిమా హీరోల అభిమానులు తెలుసుకుంటే బాగుంటుంది.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి