. అతి తక్కువ కాలంలోనే టాలీవుడ్ టాప్ హీరోయిన్‌గా నిలిచి.. తన అందచందాలతో ఓ రేంజ్‌లో అభిమానులను సంపాదించుకున్న మిల్క్ బ్యూటీ తమన్నా గురించి కొత్తగా చెప్పనక్కర్లేదు.
ఇప్పుడు కొత్తగా తమన్నా లవ్ గురించి, సామాజిక మాధ్యమాలలో హాత్ హాట్ డిస్కషన్స్ జరుగుతున్నాయి!
ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మిల్క్ బ్యూటీని మీ లవ్ గురించి చెప్పండి అనిఅడగ్గా 'మీరు అనుకుంటోంది కరక్టే, నేను లవ్‌లో ఉన్నానని' ఒప్పేసుకుని, విలేకరుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది. ఇది వింటున్న అభిమానులుకూడా ఇంటస్ట్రింగ్‌గా ఇంతకీ ఆ అదృష్టవంతుడు ఎవరై ఉంటాడు? అతని గురించి తమన్నా ఏం సమాధానం చెబుతుందా అని వెయిట్ చేస్తుండగా ఆఖరికి ఇలా సమాధానమిచ్చింది. ‘నా ప్రొఫెషనే నాకు లవ్’. అని, అందరికీ ఓ మోస్తరు షాక్ ఇచ్హింది.
ప్రస్తుతం అబ్బాయిల గురించి ఆలోచించే టైం నాకు లేదు. అంతకు మించి నాకు ఎవరిపైనా ఎలాంటి ప్రేమలు లేవు, ప్రస్తుతం లవ్ చేసే సమయం కూడా లేదు, సినిమాలతో బిజీబిజీగా ఉన్నానంటూ మిల్క్ బ్యూటీ చెప్పింది.!
అంతేకాకుండా నా మనసుకు నచ్చినవాడు ఇంత వరకూ దొరకలేదు, ఒక వేళ ఎవరైనా నచ్చితే నేనే ముందుకొచ్చి అందరికీ లవ్ విషయం చెబుతానని తన మనసులో మాట చెప్పింది మిల్క్ బ్యూటీ.
సో అలాంటి స్వీట్ న్యూస్ కోసం అభిమానులంతా ఎదురుచూడక తప్పదు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి