google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఆసక్తికర కలయిక

9, అక్టోబర్ 2016, ఆదివారం

ఆసక్తికర కలయిక


పైకి కనిపించకపోయినా, నందమూరి, మెగా కాంపౌండ్ మధ్య ఏదో వైరం వుందనే పరిశ్రమలో, అభిమానుల మధ్య చర్చలు నడుస్తూ వుంటాయి. చిరు-బాలయ్య దగ్గరనుంచి, ఈనాటి జూ.యంటీఆర్-రాంచరణ్, అల్లూఅర్జున్ మధ్య పోటీ వాతావరణం వుండనే వుంటోంది.

కానీ ఈ రెండు ఫామిలీల  కాంబినేషన్లో సినిమా మొదలైతే?  అది ఎంత సెన్షేషన్ క్రియేట్ చేస్తుందో వేరే చెప్పక్కరలేదు.

 అత్యంత ఆసక్తికరమైన వీరి కలయికను ఓ నిర్మాత నిజం చెయ్యబోతున్నారని ఇప్పుడు ఓ టాక్ వినబడుతోంది.  ఆ రెండు కుటంబాల వారు ఎదైనా ఫంక్షన్‌లో కలిస్తేనే వారి అభిమానులు ఆసక్తిగా చర్చించుకుంటారు. అలాంటిది ఆ రెండు ఫ్యామిలీస్‌కు చెందిన హీరోలు కలిసి నటిస్తే ఎలా ఉంటుందో చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ ఆసక్తికర వార్తను సుసాధ్యం చేయడానికి కల్యాణ్‌రామ్‌, సాయిధరమ్‌ తేజ్‌ పూనుకున్నారని తెలిసింది.

  చిరుతో అనేక విజయవంతమైన సినిమాలు నిర్మించిన క్రియేటివ్ కమర్షియల్ అధినేత కె.ఎస్‌. రామారావు  వీరిద్దరి కాంబినేషన్‌లో ఓ సినిమా నిర్మిస్తారని, ఈ మల్టీస్టారర్‌కు ‘రామకృష్ణ’ అనే టైటిల్‌ ఫిక్స్‌ చేసినట్టు తెలుస్తోంది. క్రియేటివ్‌ కమర్షియల్‌ బ్యానర్‌పై ఇటీవలె ఈ పేరును ఛాంబర్‌లో రిజిస్టర్‌ చేయించారు.

కాగా ఈ సినిమాకు ఏ.యస్.రవికుమార్ చౌదరి దర్శకత్వం వహిస్తారని అనుకుంటున్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి