అమెరికా అధ్యక్ష్య ఎన్నికల్లో భాగంగా జరిగిన తొలి బిగ్ డిబేట్‌లో హిల్లరీదే పైచేయి సాధించగా ట్రంప్ కాస్త వెనుకబడిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అందరికళ్లూ అమెరికాలోని జరగనున్న రెండో బిగ్ డిబేట్‌పైనే ఉన్నాయి. భారత కలమాన ప్రకారం సోమవారం ఉదయం రెండో బిగ్ డిబేట్ జరగనుంది.
మరి ముఖా ముఖిలో ఎవరిది పైచేయి కానుంది? ఏయే అంశాలు ప్రధాన అంశాలు కానున్నాయనేది మరి కొద్ది గంటల్లో తేలనుంది.
సెయింట్ లూయీస్ వేదకగ రిపబ్లికన్, డెమొక్రటిక్ అధ్యక్ష అభ్యర్థుల మధ్య బిగ్ డిబేట్‌కు సర్వం సిద్ధమైంది. భద్రతాచర్యల్లో భాగంగా చాలా రోడ్లను మూసివేశారు. హ్లిరీ, ట్రంప్‌ల మధ్య 90 నిముషాలపాటు ముఖాముఖి జరగనుంది.
వివాస్పద వ్యాఖ్యానాలతో, కొంతమందిలో నెగిటివె ప్రొఫైల్ ను క్రియేట్ చేసుకున్న ట్రంప్ తాను సౌమ్యుడినని, నోటి దురుసు లేదని అమెరికన్ ఓటర్లను ఒప్పించే పనిలో ట్రంప్ ఉన్నారు. హిల్లరీ మాత్రం మొదటి డిబేట్ లో వచ్చిన ఆత్మవిశ్వాశంతో దూకుడుమీద వున్నారు . తొలి చర్చలో హిల్లరీ 62 శాతం ఆధిక్యం సాధించగా, 27 శాతం మాత్రం ట్రంప్ కి అనుకూలంగా వున్నట్టు సర్వేలలో తేలింది.
ప్రపంచవ్యాప్తంగా ప్రభావితం చూపిస్తున్న టెర్రరిజం లాంటి పరిస్థితుల్ని ఎదుర్కోవడానికి శక్తి సామర్ధ్యాలు కావాలని హిల్లరీ లో ఆ లక్షణాలు కనిపించడంలేదని ట్రంప్ పేర్కొన్నారు. తాను 102 దేశాలు పర్యటించి శాంతి ఒప్పందాలు, కాల్పుల విరమణ ఒప్పందాలు కుదిర్చానని, తనకు అమెరికా అధ్యక్షుడు కాగల స్టామినా ఉందని ఆయన చెప్పారు.
కాగా మూడో బిగ్ డిబేట్ ఈ నెల 19న జరగనుంది.
తొలి బిగ్ డిబేట్‌లో ట్రంప్ వాదనకు అనుకూలంగా అమెరికన్ ఓటర్లు గొప్పగా స్పందించలేదు. సెలబ్రిటీలు, వ్యాపారవేత్తలు, ఐటీ నిపుణులు ట్రంప్‌కు ఎక్కువ మద్దతు ఇవ్వగా, మహిళలలు, మధ్యతరగతి ప్రజలు ఎక్కువశాతం శాతం మంది హిల్లరీకే మద్దతు ఇస్తున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి