సెప్టెంబర్‌లో సేవలు ప్రారంభించిన రిలయెన్స్ 'జియో' ఒక్క నెలలోనే కోటీ అరవై లక్షల మంది వినియోగదారులను ఆకర్షించి ప్రపంచ రికార్డ్ సృష్టించింది. 4జీ మార్కెట్లో జియో అత్యంత వేగంగా ఎక్కువ మంది వినియోగదారులను చేర్చుకున్న సంస్థగా ఈ రికార్డు సృష్టించిందని ఆ సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది.
అంతర్జాతీయ సంస్థలు ఫేస్‌బుక్, వాట్సాప్, స్కైప్ కన్నా తక్కువ సమయంలో ఎక్కువమందిని ఇదే ఆకర్షించిందని రిలయెన్స్ వర్గాలు తెలియజేసాయి.
‘జియో' కు వచ్చిన అద్భుత స్పందన పట్ల మేం ఆనందం వ్యక్తం చేస్తున్నాం, డేటా శక్తితో భారత్‌లో సరికొత్త నెట్‌వర్క్‌ను నిర్మిస్తామని’ రిలయన్స్ సంస్థల చైర్మన్ ముకేశ్ అంబానీ అన్నారు.
పది కోట్ల మంది చందాదారులను ఆకర్షించడమే తమ లక్ష్యమని ఆయన గతంలో పేర్కొన్న సంగతి తెలిసిందే.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి