మంచు లక్ష్మి నటించిన లక్ష్మిబాంబ్ ట్రైలర్ చూసాక, ఆమెతో మరో రాములమ్మ తీయాలనిపించిందని దర్శకరత్న దాసరి అన్నారు.
మంచు లక్ష్మి ప్రధాన పాత్రలో లో రూపొందుతున్న చిత్రం ‘లక్ష్మీబాంబ్’. దీనికి కార్తికేయ గోపాలకృష్ణ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ చిత్రం ఆడియో విడుదల కార్యక్రమాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని నిర్వహించారు. ఆడియో సీడీలను దాసరి విడుదల చేసిన సందర్భంగా మాట్లాడుతూ..
" సినిమాలోని పాటలు చూసిన తర్వాత టీం చాలా మంచి సినిమా తీయడానికి ప్రయత్నించినట్లునాకు అనిపిస్తొంది -
‘ప్రేమమ్’ సినిమా, సాంగ్స్ చూసి సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆరోజే చెప్పాను. అలాంటి అనుభూతే నాకు ఈ సినిమా సాంగ్స్ చూడగానే కలిగింది. సునీల్ చాలా మంచి సంగీతాన్ని అందించాడు. లక్ష్మి నా బిడ్డ, చిన్నప్పట్నుంచి లక్ష్మి గురించి తెలుసు. ఈ సినిమా ట్రైలర్ చూసి లక్ష్మితో రాములమ్మ తరహాలో సినిమా చేయాలనిపించింది అని వ్యాఖ్యానించాడు.
ఇదే కార్యక్రమంలో మోహన్‌బాబు మాట్లాడుతూ.. ‘దర్శక నిర్మాతలు నా వద్దకు వచ్చి ఈ సినిమా చేస్తున్నట్లు చెప్పారు. లక్ష్మి ఒప్పుకుంటే నాకేం అభ్యంతరం లేదని చెప్పాను. సినిమా సాంగ్స్, ట్రైలర్ బావున్నాయి. ‘గుండెల్లో గోదారి’ కంటే ఈ సినిమాలో లక్ష్మి ఇంకా అద్భుతంగా చేసింది. మా అమ్మాయేనా ఇంత బాగా నటించింది అనిపించింది’ అని చెప్పారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి