google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: ఉరీ దాడిని ఖండించిన పాక్‌ గాయకుడు

8, అక్టోబర్ 2016, శనివారం

ఉరీ దాడిని ఖండించిన పాక్‌ గాయకుడు



ఉరి సైనిక శిభిరంపై పాక్ తీవ్రవాదుల దాడి, అనంతరం భారత్ సర్జికల్ స్త్రైక్,  వీటిగురించి కళాకారుల మధ్య వాదోపవాదాలు కొనసాగుతూన్న విషయం తెలిసిందే.

సల్మాన్ ఖాన్ లాంటి నటులు పాక్ కళాకారులను వెనకేసుకురావడం, సల్మాన్ పై దేశవ్యాప్తంగా నిశనలు చెలరేగడం కూడా తెలిసిందే.

కానీ ఆశ్చర్యకరంగా పాక్ కళాకారులవైపునుంచి తొలిసారి భారత్ కు మద్దతు లభించింది.

పాక్ గాయకుడు షఫ్కత్‌ అమానత్‌ అలీ ఉగ్రవాదులు జరిపిన ఈ దాడిని బహిరంగంగా ఖండించారు. ‘ఇది ఉగ్రవాదుల దాడి, నేను దీన్ని ఖండిస్తున్నాను" అని, ఓ కార్యక్రమంలో  మీడియాతో అన్నారు.

 పాక్‌ అర్టిస్టులు ఈ విషయంపై మౌనం వహించడంపై తన అభిప్రాయాన్ని అడగగా.. ‘నాకు తెలిసినంతవరకు, పాకిస్థాన్‌ నటీనటులు ప్రపంచంలోని ఏ ప్రాంతంలో జరిగిన దాడినైనా ఖండిస్తారు, ఇది ఏ దేశానికైనా వ్యతిరేకమైనదే..  చాలా ఏళ్లుగా మనం ఈ కారణంతో బాధ పడుతున్నాం. మన సైనికుడు, పౌరుడు మృతి చెందితే ఎలా ఉంటుందో మనకు తెలుసు. నేను పాకిస్థాన్‌లో ఉన్నాను, కాబట్టి నేను మా ఆర్మీకి మద్దుతు తెలుపుతా, అంతేగానీ సరిహద్దుల్లో జరిగే దాడులవల్ల వుగ్రవాదం అదుపులో వుంటుందంటే అలాంటి దాడులకు నేను మద్దతు ఇస్తాను అని, సర్జికల్ దాడిని దృష్టిలో వుంచుకుని , అలీ అన్నాడు.

కానీ ఇలాంటి సున్నితమైన సందర్భాల గురించి వాదించుకోవాల్సిన సమయం ఇది కాదు. ఇరు దేశాలు కూర్చుని శాంతిని నెలకొల్పడానికి చర్చలు జరపాల్సిన సమయం’ అని షఫ్కత్‌ పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి