బాలకృష్ణ కథానాయకుడిగా దర్శకుడు క్రిష్ ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ కి సంబంధించి, మొదటి ఫోటోను, చిత్ర బృందం ఈరోజు విడుదల చేసింది.
బాలకృష్ణ రాజసం ఉట్టిపడేలా సింహాసనంపై కూర్చొని ఉన్న ఈ ఫొటో అభిమానులను అలరిస్తోంది అనడంలో సందేహం లేదు.
శ్రియ, హేమమాలిని, కబీర్‌బేడీ ఈ చిత్రంలో ప్రధాన పాత్రలలో నటిస్తున్న ఈ బాలకృష్ణ 100వ చిత్రాన్ని, ఫస్ట్‌ఫ్రేమ్ ఎంటర్‌టైన్‌మెంట్ పతాకంపై వై. రాజీవ్‌రెడ్డి, జాగర్లమూడి సాయిబాబు నిర్మిస్తున్నారు. సినిమాకు సంగీతాన్ని చిరంతన్ భట్ అందిస్తున్నారు.
వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా ‘గౌతమిపుత్ర శాతకర్ణి’ని ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నట్టు, చిత్ర నిర్మాతలు ఇంతకుముందే తెలియజేసి వున్నారు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి