google-site-verification=d4bF8NWc4x746zF3idQBTNQ6r8zvxKCq-tKl9t4ClkI LINK TELUGU: వందకోట్లకు పరువునష్టం దావా వేసిన సల్మాన్

8, అక్టోబర్ 2016, శనివారం

వందకోట్లకు పరువునష్టం దావా వేసిన సల్మాన్




ముంబై: ప్రముఖ బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ ఓ టీవీ చానల్‌పై రూ.వంద కోట్లకు పరువునష్టం దావా వేసినట్టు తెలిసింది.

 స్టింగ్ ఆపరేషన్ పేరుతో ఆ చానల్ తన పరువును బజారుకు ఈడ్చిందని ఆరోపిస్తూ బాంబే హైకోర్టులో ఆగస్ట్ నెల  దావా వేశాడు.  1998లో జోధ్‌పూర్ శివారులోని  ఫామ్స్‌లోనూ సల్మాన్ జింకలను వేటాడినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

ఆ చానల్  తన పరువు ప్రతిష్ఠలను దారుణంగా దెబ్బతీసిందని , వీరు తీసిన దృశ్యాలు ప్రసారం కాకుండా అడ్డుకోవాలని, సల్మాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశాడు.

 అప్పట్లో జింకలను సల్మాన్ ఖాన్ వేటాడడాన్ని చూసినట్టు కొందరు ప్రత్యక్ష సాక్షులు తెలిపినట్టు చానల్ పేర్కొంది. అయితే ఆ తర్వాత సాక్షులు మాట మార్చారు. స్టింగ్ ఆపరేషన్ దృశ్యాలను, స్క్రిప్టును ఈ ఏడాది ఆగస్టు 24న తొలగించినట్టు ఈ నెలలో జరిగిన కోర్టు హియరింగ్‌లో సదరు చానల్ పేర్కొంది.

 కాగా వివాదాన్ని కోర్టు బయట పరిష్కరించుకోవాలని నిర్ణయించుకున్న ఇరు పార్టీలు ఈమేరకు కోర్టులో అఫిడవిట్ దాఖలు చేసినట్టు తెలుస్తోంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి