కాంగ్రెస్ నేత సంజయ్ నిరుపమ్, ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్..
తాజాగా సర్జికల్ దాడి వీడియో చూపించకపోతే, నమ్మలేం అనే జాబితాలో ఇప్పుడు టీడీపీ సీనియర్ నేత జేసీ దివాకర్‌రెడ్డి కూడా చేరాడు.
మానవహక్కుల వేదికల మీద, అంతర్జాతీయ సమాజం ముందు చెడ్డపేరు తెచ్చుకోకుండా వుండటానికి భారతదేశం వ్యూహాత్మకంగా గోప్యత పాటిస్తోందని, ఏమాత్రం అవగాన వున్నవారికైనా తెలుస్తుంది.
కానీ చిన్నపిల్లలా అదేదో య్యూట్యూబ్ వీడియోలు అడిగినట్టు అడగడం అనేది, సిల్లీగా అనిపిస్తోంది.
సర్జికల్ దాడివల్ల ఎంతగా దెబ్బతినిందో పాకిస్తాన్ కి తెలుసు కాబట్టే, కక్కాలేక, మింగాలేక, భారత్ ని దోషిగా నిలబెట్టే అవకాశం కోసం ఎదురుచూస్తోంది. ఇలాంటపుడు, ఆ వీడియోలు బయట పెట్టడం వల్ల, పాక్ కి మంచి అవకాశం దొరికినట్టవుతుంది.
జేసీ దివాకర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడుతూ, ప్రత్యేకహోదా విష్యంలో కేంద్రం అబద్దం చెప్పింది కాబట్టి , సర్జికల్ దాడి విషయంలో కూడా అబద్దం చెప్పివుంటుందని అనుకోవాల్సి వస్తుందనీ, కాబట్టి, దానికి సంబందించిన వీడియోల్ని బయటపెట్టడం వల్ల, తప్పక నమ్ముతారని, అందరికీ చూపించడం వీలుకాకపోతే, కనీసం మాజీ ప్రథానికి, అనుమానిస్తున్న రాజకీయనాయకులకి చూపించాలని డిమాండ్ చేసాడు.
సగటు రాజకీయ నాయకుల మనస్తత్వాన్ని ప్రతిబింబించేలా, సర్జికల్ స్ట్రైక్స్‌ని కూడా రాజకీయం చేయడంలోనే, మన రాజకీయ నాయకుల దిగజారుడుతనమేంటో ఇలాంటి సందర్భాలపుడు అర్థమవుతూ వుంటుంది.
సైన్యం ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే ఇలాంటి వ్యాఖ్యానాలు, మన రాజకీయ నాయకుల అవగాహనారాహిత్యాన్ని బయటపెడుతూ వుంటాయి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి